అమెరికాలోని మధ్య ప్రాంత రాష్ట్రాలు మంచు తుపానులో చిక్కుకున్నాయి. పదేళ్ల తర్వాత ఈసారి అత్యధికంగా మంచు కురుస్తోంది. చలి గాలులతోపాటు మంచు పేరుకుపోతోంది. ప్రయాణాలు ప్రమాదంలో పడ్డాయి. కన్సాస్, పశ్చిమ నెబ్రాస్కా, ఇండియానాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. 70వ అంతర్రాష్ట రహదారిపై 8 అంగుళాల మందంలో మంచు పేరుకుపోయింది. కన్సాస్, మిస్సోరీలకు వాతావరణశాఖ మంచు తుపాను హెచ్చరికలను జారీ చేసింది.