TG: ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న పత్తి బస్తాలు కాలిపోతున్నాయి. మార్కెట్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు యత్నిస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.