మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. డిసెంబర్ 19, 2024న, ఐటీ అధికారులు ఒక కారు నుండి 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మాజీ RTO కానిస్టేబుల్ సౌరభ్ శర్మగా గుర్తించారు. అతని ఇంట్లో సోదాల సమయంలో రూ.500-700 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కనుగొనబడ్డాయి. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. ఇది బీజేపీ హయాంలో అవినీతికి నిదర్శనమని INC విమర్శిస్తోంది.