మాజీ మంత్రి అయ్యన్నను సత్కరించిన మంత్రి అనిత

60చూసినవారు
మాజీ మంత్రి అయ్యన్నను సత్కరించిన మంత్రి అనిత
మాజీ మంత్రి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడితో పాయకరావుపేట ఎమ్మెల్యే మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో భేటీ అయ్యారు. ఆమె అయ్యన్నను గురువారం సత్కరించారు. మంత్రి పదవి చేపట్టిన అనితకు అయ్యన్న శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. అందరి సహకారం సమన్వయంతో విశాఖ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్