నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి గోడలు కూల్చిన సంఘటనలో హైకోర్టుకు పోర్జరీ పత్రాలు సమర్పించారనే నేరంపై అయ్యన్నపాత్రుడు ఆయన తనయుడు రాజేష్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సెక్షన్ సిఆర్పి 50ఏ ప్రకారం సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చి అయ్యన్నపాత్రుడు ఆయన తనయుడు రాజేష్ ను ఏలూరు తీసుకెళ్లారు. వీరిద్దరిపై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో 464, 467, 474, 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు. వీరిద్దరిని ఏలూరు కోర్టులో హాజరపరుస్తామన్నారు.