శ్రీ వారి దివ్య దర్శనానికై తరలి వెళ్లిన గిరి భక్తులు

946చూసినవారు
తిరుమల తిరుపతి శ్రీ వారి దివ్య దర్శనంకు కొయ్యూరు మండలం నుండి భక్తులు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొయ్యూరు కి చెందిన 47 మంది భక్తులను ప్రత్యేక బస్సులో తిరుమల తిరుపతి శ్రీ వారి దివ్య దర్శనానికి తరలించారు. సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ మాదల శ్రీను ఆధ్వర్యంలో భక్తులను రాజేంద్రపాలెం నుండి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో తరలించారు. ఏజెన్సీ 11 మండలాల నుండి నిర్దేశించిన సమయాల్లో గిరి భక్తులను ప్రత్యేకంగా తిరుమల శ్రీవారి ఉచిత దివ్య దర్శనానికి ప్రత్యేక బస్సుల్లో అధికారులు తరలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్