అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ ముట్టడం రాజబాబు జిల్లా కన్వీనర్ రామారావు దొర సలహాదారుడు సోనాయి గంగరాజు మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంతంలో తమ ఉద్యోగాలు తమకే కావాలి లేదంటే యుద్ధమేనని వారు ప్రకటించారు .అలాగే ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి పాడేరు వచ్చిన డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పిడిక రాజన్న తోట మాట్లాడుతూ జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ వేసామని షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ ఆదివాసులకేనని ప్రకటించారు. కానీ ఏకలవ్య మోడల్ స్కూల్లో ఉద్యోగాలు నిమిత్తం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు .మొత్తం ఉద్యోగాలన్నీ గిరిజినేతరులకు ఇవ్వడానికి ఐటిడిఏ పిఓ జిల్లా కలెక్టర్ ప్రణాళిక సిద్ధం చేశారని అలాగే ఏపీ టీ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ తో పాటు ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగాలన్నీ నాన్ డ్రైవర్స్ తో నింపేశారని వారన్నారు ప్రభుత్వము జీవో నెంబర్ త్రీపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెబుతుంటే అధికారులు ఏ విధంగా నియమకాలు చేపడుతున్నారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో కన్వీనర్ జువ్వాది సూర్యనారాయణ, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ,బూడిద మాధవరావు కిరి సాని కిషోర్ ,తదితరులు పాల్గొన్నారు.