మాంసం, చేపల దుకాణాలపై అధికారులు దృష్టి సారించాలి: బిఎస్పి

1362చూసినవారు
ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యక్ష ము గా ప్రభావం చూపించే మాంసం చేపలు విక్రయాల దుకాణాల మీద అధికారులు దృష్టి సారించాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇంఛార్జ్ సూదికొండ మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణము లో పలు ప్రాంతములలో పలు మాంసం విక్రయ దుకాణాలను ఆదివారం సందర్శించి కొనుగోలు దారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ మాంసం దుకాణాల వద్ద ధరలు పట్టికలు తప్పని సరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మరియు తూనికలు కొలతలు శాఖ అధికారులు తరుచూ తనిఖీలు నిర్వహించలని డిమాండ్ చేశారు. మాంసం చేపలు వంటి ఆహార పదార్థములు విక్రయాలు జరిగే ప్రాంతం లో పరిశుబ్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చేల అధికారులు చర్యలు చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్