చంద్రబాబు కోలుకోవాలని ప్రత్యేక పూజలు

1691చూసినవారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ లు కరోనా బారినుండి త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తూ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మొదమాంబ కు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. పాడేరు పట్టణంలో గల మహిమాన్వితమైన మోదకొండమ్మ తల్లి ఆలయం లో తేదేపా అరకు పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్, తెలుగు యువత నేతలు సురేష్ కుమార్ నీలకంఠం, పార్టీ మండల అధ్యక్షుడు రామునాయుడు తదితరులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సోకిన అధినేత చంద్రబాబు, లోకేష్ లు త్వరగా కోలుకోవాలని వారంతా ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్