Jan 07, 2025, 00:01 IST/
పెరిగిన చలి.. ఆ రెండు రోజులు జాగ్రత్త
Jan 07, 2025, 00:01 IST
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో 5 రోజులపాటు ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడుతుందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని, ఆ తర్వాత 2 రోజులు 2-3 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.