గోవా నుంచి అక్రమంగా హైదరాబాద్కు వాస్కోడిగామా రైల్లో గోవా నుంచి తీసుకువస్తున్న 82 మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్ టీమ్ సికింద్రాబాద్లో పట్టుకుంది. ఎన్టీఎఫ్ టీముల సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజుల నేతృత్వంలో 20 మంది ఎస్టీఎఫ్ సిబ్బంది షాద్నగర్లో రైలు ఎక్కి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుకున్న 82 మద్యం బాటిళ్ల విలువ రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.