మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. కర్ణాటకలోని చామరాజనగర సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తేజస్విని (8) సోమవారం ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వచ్చింది. స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఉపాధ్యాయులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో కన్నుమూసింది. గుండెపోటు కారణంగా ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.