ప్రస్తుతం భారత్‌లో వ్యాపిస్తున్న hMPV వైరస్ గురించి WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలక సూచనలు చేశారు. దీనిపై ఆందోళన వద్దని, ఈ వైరస్ కొత్తగా వచ్చిందేమీ కాదని, గతంలోనే ఉందన్నారు. ఈ వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, జలుబు చేసినప్పుడు సాధారణంగా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వెల్లడించారు. కాగా 2019 మార్చి నుంచి సౌమ్య WHOలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు.