అనకాపల్లి మండలంలోని వేటజంగాలపాలెం, పాపయ్యపాలెం గ్రామాలకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో సేకరించేందుకు భూములను ఇవ్వబోమని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు గంట శ్రీరామ్ మాట్లాడుతూ సుమారు 100 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే కోర్టు దిక్కారం కింద అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.