అవి పులి అడుగులే.. గ్రామా వాసులు జాగ్రత్త!!
అటవీశాఖ సిబ్బంది కూనవరం అటవీ క్షేత్రంలో రెండు గ్రామాల్లో పులి పాదముద్రలను గుర్తించారు. తాటిలంక, దూగుట్టలలో పెద్ద పులి పాదముద్రలు కనుగొనగా, అధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్ భవిత, సబ్ డిఎఫ్ఎ కేవీఎస్ రాఘవరావు, అటవీ అధికారి ఎం. కరుణాకర్, సిబ్బంది పరిశీలించి అవి పులి పాదముద్రలేనని నిర్ధారించారు. ఈ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.