కొడాలి నానికి ముంబైలో సర్జరీ సక్సెస్

53చూసినవారు
కొడాలి నానికి ముంబైలో సర్జరీ సక్సెస్
AP; వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి గుండె ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నానిని హైదరాబాద్ AIG నుంచి ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ కు కుటుంబసభ్యులు తరలించగా.. బుధవారం ప్రముఖ డాక్టర్ రమాకాంత్ పాండే ఆయనకు బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అదే ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని త్వరలోనే డిశార్జ్ కానున్నారు.

సంబంధిత పోస్ట్