AP: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు నవీన్ దాడి చేసిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ బయటకొచ్చింది. నిందితుడు ముందుగా ఇంటి వెనుకకు వెళ్లిన నవీన్.. కొంతసమయానికి ముందు గేటు తీసి ఇంట్లోకి ప్రవేశించాడు. అతను వెళ్లిన కొంతసమయానికే బాధితురాలు దీపిక రక్తపు మడుగులో ఉంది. దీపికను చూసిన స్థానికులు ఇంట్లోకి వెళ్లగా అప్పటికే ఆమె తల్లి మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.