ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అయితే దీనిపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ పాస్టర్ జెస్సికా విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారన్నారు. ప్రవీణ్ ఎప్పుడూ మతసామరస్యాన్ని కోరుకునేవారని ఆమె పేర్కొన్నారు.