మంచు దుప్పటి పరుచుకున్న అరకులోయ

81చూసినవారు
అల్లూరి జిల్లా మన్యం గ్రామీణ ప్రాంతాల్లో చలి విజృంభించింది. పర్యటక కేంద్రమైన అరకులోయ మండల పరిసర ప్రాంతంలో మంచు దట్టంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ లాడుతున్నారు. చలి పెరగడమే కాకుండా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సోమవారం తెల్లవారుజామున నుంచి ఉదయం 9: 30 గంటల వరకు కురిసిన దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటూ చలి తీవ్రతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

సంబంధిత పోస్ట్