హరే కృష్ణ మూవ్మెంట్ , విశాఖపట్నం ఆధ్వర్యంలో మొదటి సారిగా విజయ దశమి ఉత్సవాలను నిర్వహించనున్నారు. బాణాసంచాతో తయారు చేసిన 20 అడుగుల ఎత్తుగల రావణ వధను హరే కృష్ణ వైకుంఠం భీమిలీలోని గంభీరంలో నిర్వహించనున్నట్టు హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి శ్యామ మాధవ దాస గురువారం తెలిపారు. విశాఖ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.