విశాఖ: చిన్నపాటి వర్షానికే జలమయమైన రోడ్డు

50చూసినవారు
విశాఖలోని ఆర్కే బీచ్ సమీపంలో విక్టరీ ఎట్ సి వద్ద బిటి రోడ్డు నీట మునిగింది. సోమవారం ఉదయం కురిసిన వర్షానికి ఆ రహదారిపై భారీగా నీరు చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా రోడ్లపైకి చేరింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో తరచూ ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. జీవీఎంసీ అధికారులు తక్షణ స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్