Nov 26, 2024, 15:11 IST/
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
Nov 26, 2024, 15:11 IST
గుజరాత్లోని సురేంద్ర నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వ్యాన్ ప్రమాదవశాత్తు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.