Nov 26, 2024, 14:11 IST/అంబర్పేట్
అంబర్పేట్
ఓయూ: నిరుద్యోగ కృతజ్ఞత సభ గోడపత్రిక ఆవిష్కరణ
Nov 26, 2024, 14:11 IST
ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చే నెల 21న జరిగే నిరుద్యోగ కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని పలువురు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు టిపిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరై మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ ఓయూ అద్యక్షుడు మేడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.