TG: సీఎం రేవంత్‌రెడ్డి పాలన హాస్టల్ పిల్లలకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. హాస్టళ్లలో మరణమృదంగాలు వినిపిస్తుంటే సీఎం రేవంత్ ఢిల్లీలో తిరుగుతున్నాడని, ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం.. హాస్టల్ పిల్లలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ పాలనలో ఇప్పటివరకూ 48 మంది హాస్టల్ పిల్లలు మరణించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.