ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి మంగళవారం ఐఎస్ సాధన్ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను ప్లకార్డులతో ప్రదర్శించారు. " హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి" అనే నినాదాలతో విద్యార్థులతో పోలీసులు ప్రదర్శన నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, హెల్మెట్, సీటు బెల్టు తప్పకుండా ధరించాలని సూచిస్తూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు