మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో విద్యుత్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఈ బలరాం నాయక్, లైన్ మెన్ హేమంత్ నాయక్ ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కారు. ఏఈ, లైన్ మెన్ ను అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.