సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ డెయిరీ ఉద్యోగులు అక్కిరెడ్డిపాలెం డెయిరీ గేటు వద్ద చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం నాటికి నాలుగవ రోజుకు చేరుకున్నాయి. డెయిరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కెవీవీ మూర్తి, కార్యదర్శి ఎస్ రమణ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వేతనాలు పెంచాలన్నారు. పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలన్నారు.