కొయ్యూరు మండలంలో 80 కిలోల గంజాయి స్వాధీనం

65చూసినవారు
కొయ్యూరు మండలంలో 80 కిలోల గంజాయి స్వాధీనం
కొయ్యూరు మండలంలోని చీడిపాలెం జంక్షన్ వద్ద 80 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్సై కేవీ నాగార్జున బుధవారం తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు, తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా ఆటో, ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశామన్నారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న గూడెం కొత్తవీధి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్