Feb 10, 2025, 18:02 IST/
కాకరకాయ రసంతో చుండ్రు సమస్యలకు చెక్
Feb 10, 2025, 18:02 IST
కాకరకాయ రసంతో చుండ్రు సమస్యలకు చెక్ చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు సమస్యను దూరం చేసుకోవాలంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అనంతరం దీన్ని కాకర రసంలో కలిపి కుదుళ్లకు పట్టించాలి. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.