తెలంగాణలో రైతు భరోసా మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏడెకరాల వరకే రైతుభరోసా ఇవ్వడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు ఇవ్వొద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ తరహాలోనే నిబంధనలు అమలు చేయనునట్లు సమాచారం.