నర్సీపట్నం ఉత్తర వాహిని సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వారు దత్తత తీసుకున్నారు. గురువారం విజయవాడ దేవదాయ శాఖ కమిషనర్, అన్నవరం కార్య నిర్వహణ అధికారికి దత్తత సంబంధిత ఆదేశాలు జారీ చేశారు. ఈ దత్తతతో బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. అయ్యన్న మంత్రిగా ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించారు