గొలుగొండ: అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు

65చూసినవారు
గొలుగొండ: అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు
అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని గొలుగొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు కుమార్ హెచ్చరించారు. శుక్రవారం గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామంలో నిర్వహించిన దాడిలో 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగం నూకినాయూడిపై కేసు నమోదు చేశామన్నారు. సారా తయారుచేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెల్ట్ షాపులకు అనుమతి లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్