నర్సీపట్నం పెద్ద చెరువును ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి కోసం ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేసి పంపించాలని ఆర్అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా ట్యాంక్ బండ్, పార్క్, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ 21న స్పీకర్ అయ్యన్న ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ ప్రాజెక్టు విషయమై చర్చించారు.