నూతన మద్యం విధానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాడేరులో మద్యం దుకాణాలకు లాటరీ తీయగా షాప్ నంబర్-9 విశాఖ ప్రాంతానికి చెందిన వ్యక్తికి వచ్చింది. కానీ అధికారులు తిరస్కరించారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడుతూ. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పి. పరందామాన్కు లాటరీలో పెదబయలు మద్యం దుకాణం వచ్చింది. అయితే అతను గిరిజనేతరుడు కావడంతో రిజెక్ట్ చేసి గిరిజన వ్యక్తికి కేటాయించామన్నారు.