ఎస్. రాయవరం మండలంలో గల పెద్ద ఉప్పలం గ్రామంలో సోమవారం ధనుర్మాస ముగింపు సందర్భంగా కలశంతో పాటు శ్రీ సీతారామ ఉత్సవ విగ్రహాలుతో తిరువీధి సేవ నిర్వహించారు. స్థానిక రామాలయం నుండి మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ధనుర్మాస ముగింపు సందర్భంగా ఈకార్యక్రమం నిర్వహించినట్లు పి. గణేష్ తెలిపారు.