పెందుర్తిలో దారుణం.. తండ్రిని చంపేసిన కొడుకు
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నరవ సమీపంలోని మన్యం కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు. దసరా నుంచి మద్యం సేవిస్తూ గొడవ పడుతున్న గోపి తండ్రి దేముడును మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో పీక కోసేశాడు. సంఘటన స్థలములోనే దేముడు మృతి చెందగా స్థానికుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు ఘటన స్థలంలో గోపిని అదుపులో తీసుకున్నారు.