వైరల్ అవుతున్న నర్సరీ స్కూల్ ఫీజు స్ట్రక్చర్

62చూసినవారు
వైరల్ అవుతున్న నర్సరీ స్కూల్ ఫీజు స్ట్రక్చర్
బెంగళూరుకు చెందిన ఓ స్కూల్ నర్సరీకి ఫీజు రూ.1.5 లక్షలు. అయితే ఈ ఫీ స్ట్రక్చర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పేరెంట్ ఓరియంటేషన్ ఫీ కింద రూ.8,400 వసూలు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఈ ఫొటోను పోస్ట్ చేశారు. డాక్టర్ కన్సల్టేషన్ కోసం పేరెంట్ ఓరియంటేషన్ ఫీజులో 20 శాతం చెల్లించేందుకు కూడా పేరెంట్స్ ఆసక్తి చూపరని వ్యాఖ్యానించారు. తానిప్పుడు క్లినిక్ మానేసి, స్కూల్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్