కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. పెందుర్తి మండలం 95వ వార్డు లక్ష్మీ నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. పలువురు పింఛన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లి దరఖాస్తులు అందజేయాలని సూచించారు. రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.