గురుద్వార్: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి

81చూసినవారు
గురుద్వార్: పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురుద్వార్ ఏపీఈపీడీసీఎల్ వద్ద కాంగ్రెస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎండీ పృథ్వీరాజ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలను పెంచబోమని హామీ ఇచ్చిన విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ రామారావు గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్