AP: తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి దళారులను నియంత్రించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీలో ఇటీవలి పరిణామాలపై ఈవో శ్యామలరావు సోమవారం వివరణ ఇచ్చారు. తిరుమలలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని గతంలో సీఎం చంద్రబాబు తమ దృష్టికి తెచ్చారని ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల సూచనల మేరకు టీటీడీలోని అన్ని వ్యవస్థలను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.