సింగపూర్‌లో తన కొడుకు ఫైర్ యాక్సిడెంట్‌లో గాయపడిన సమయంలో డిప్యూటీ CM పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదల శ్రీవారికి మొక్కుకున్నారట. ఈమేరకు ఆమె ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకొని, అన్యమతస్తులకు ఇచ్చే డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అనంతరం స్వామివారికి తన నీలాలు అర్పించి మొక్కు చెల్లించుకున్నారు. సోమవారం మార్నింగ్ శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ సతీమణి గుండు కొట్టించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.