అక్టోబర్ 29న 5 జిల్లాల్లోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. 28 తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.