డ్వాక్రా సంఘానికి రూ.10 లక్షల రుణం ఇస్తాం: బాబు

38497చూసినవారు
డ్వాక్రా సంఘానికి రూ.10 లక్షల రుణం ఇస్తాం: బాబు
తాము అధికారంలోకి వ‌చ్చాక మహాశక్తి కింద 4 కార్యక్రమాలు చేపడతామన్నారు చంద్ర‌బాబు. "ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద రూ.15,000 అంద‌జేస్తాం. 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాల్లో మహిళలను లక్షాధికారులను చేస్తాం. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం." అని డోన్ స‌భ‌లో ఆయ‌న హామీ ఇచ్చారు.