భీమవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అంకెం సీతారామ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రంలో మద్దతు పలుకుతున్న సిపిఎం, సిపిఐ పార్టీలకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 9 గ్యారెంటీలను ప్రజల ఆదరిస్తున్నారని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. నియోజవర్గం నుండి అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన అన్నారు.