జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాలు నుండి వచ్చిన ఫిర్యాదుదారులు నుండి అర్జీలను జిల్లా జాయింటు కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వీకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల స్థాయిలో జరుగుచున్న పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని పరిశీలించి, ఎంత మంది అధికారులు వచ్చారు, ఏఏ శాఖల అధికారులు రాలేదని అడిగి తెలుసుకున్నారు. హాజరు కానీ అధికారులపై అసహనం వ్యక్తం చేసారు.