అక్కపై తమ్ముడు కత్తితో దాడి

73చూసినవారు
అక్కపై తమ్ముడు కత్తితో దాడి
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్డులో ఎస్తేరు రాణి భర్తతో విడిపోయి తన కుమార్తెతో కలసి తల్లి, తమ్ముడు వద్ద ఉంటోంది. ఈ క్రమంలో తల్లితో ఎప్పటికప్పుడు రాణి గొడవ పడుతూ కొడుతోంది. గురువారం ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరగడంతో తల్లిని కొట్టి కూతురు బయటికి వెళ్లిపోయింది. పని నుంచి ఇంటికొచ్చిన కొడుక్కి తల్లి జరిగిన విషయం చెప్పడంతో కోపోద్రిక్తుడైన ఏసోబు కత్తి తీసుకొని అక్కపై దాడికి పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్