గత వైసిపి ఐదేళ్ల పాలనలో చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం చింతలపూడిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. వచ్చే ఏడాది సంక్రాంతి లోపు రోడ్లపై గుంతలు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.