ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

1075చూసినవారు
ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు
ఏలూరు అర్బన్ నందు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భముగా ప్రధానోపాధ్యాయులు సి. హెచ్. ఆర్. ఎమ్. చౌదరి మాట్లాడుతూ.. అతి చిన్న వయస్సులోనే అపారమైన మేధస్సుతో భారత దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ విస్తరించారన్నారు. అనంతరం శ్రీనివాస రామానుజన్ విశిష్టతను గణిత ఉపాధ్యాయులు ఎమ్. డి. జిక్రియా, షేక్. ఖజిదా బేగం వివరించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో వ్యాస రచన చిత్ర లేఖనం , క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్