ఏలూరు గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ వద్ద జీతాలు పెంచాలని కోరుతూ. చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలు సోమవారం కొనసాగాయి. ఈ సందర్భంగా యజమాన్య మొండి వైఖరికి నిరసనగా గేటు బయట రెండు గంటలపాటు బైఠాయించడం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం ప్రెసిడెంట్ బెజవాడ పద్మ మాట్లాడుతూ. గత వారం రోజుల నుండి జీతాలు పెంచాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని అన్నారు.