ఏలూరు పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ దాడుల్లో మద్యం తాగి మోటార్ సైకిల్ నడుపుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని సోమవారం ఏలూరు కోర్టులో హాజరుపరచగా మొత్తం రూ. 36 వేలు జరిమానా విధించారు. అనంతరం ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.